తమిళనాడులోని సేలంలో ఓ బట్టల దుకాణం ప్రారంభం సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించింది. 20 నుంచి 25 రూపాయలకే డ్రెస్‌ అంటూ ప్రచారం చేసింది. దాంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎటువంటి కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకోకుండానే వందలాది ప్రజలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ బట్టల దుకాణాన్ని సీజ్‌ చేశారు.