{"subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1594145674320","source":"other","origin":"gallery","source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1594145674326"}

ఎల్‌బీనగర్‌ పరిధి జనప్రియ కాలనీలోని ఫ్యామిలీ కేర్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఆదివారం జరిగిన యువతి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య జరిగిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన సెంటర్‌ నిర్వాహకుడు చంద్రశేఖర్‌ రెడ్డి నిందితుడు వెంకటేశ్వరరావును పట్టుకున్నట్లు తెలిసింది. హత్య అనంతరం ఎల్‌బీనగర్‌ చేరుకున్న నిందితుడు ఓ ప్రైవేట్‌ వాహనాన్ని బుక్‌ చేసుకున్నాడు. అతడు హడావిడిగా ఎల్‌బీనగర్‌ వెళ్తున్న విషయాన్ని గుర్తించిన చంద్రశేఖర్‌ కూడా అక్కడికి చేరుకున్నాడు. వెంకటేశ్వరరావును పట్టుకునే ప్రయత్నం చేశాడు. అక్కడున్న వెంకటేశ్వరరావు పరిపోయే ప్రయత్నం చేశాడు. చివరకు స్థానికుల సహకారంతో వెంకటేశ్వరరావును పట్టుకున్న చంద్రశేఖర్‌ వెంటనే డయల్‌-100కు ఫోన్‌ చేశాడు. ఎల్‌బీనగర్‌ పోలీసులు నిమిషాల్లోనే అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత యువతి హత్య జరిగిన ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిందితుడికి పెళ్లైంది. అతని భార్య వెంకటేశ్వరరావుపై వేధింపుల కేసు పెట్టినట్లు తెలుస్తోంది.

కూతురైనా కొడుకులా:

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ఆ యువతి (23) పదోతరగతి చదివింది. తల్లిదండ్రుల ఆదాయం అంతంత మాత్రమే కావడంతో ఇంటికి పెద్ద కూతురైన ఆమె కొడుకులా బాధ్యత పంచుకోవాలనుకుంది. బతుకుదెరువుకోసం నగరానికి వచ్చింది. ఫ్యామిలీ కేర్‌ సెంటర్‌ నిర్వాహకుడు చంద్రశేఖర్‌రెడ్డిని కలిసింది. ఫలానా చోట పనిచేయాల్సి ఉంటుందని చెప్పాడు. అప్పటికే ఆఫీసులో దంపతులు, మరో ఇద్దరు వ్యక్తులతో పాటు చంద్రశేఖర్‌రెడ్డి సైతం అక్కడే ఉంటున్నారు. ఆ యువతి కూడా అక్కడే ఉంది. ఆదివారం ఇద్దరు డ్యూటీకి, మరో ఇద్దరు ఊరు వెళ్లారు. ఇంట్లో చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, ఆ యువతి ఉన్నారు.

వెంకటేశ్వరరావు మూడు నెలలుగా ఆ సెంటర్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం చంద్రశేఖర్‌రెడ్డి షాపింగ్‌కు వెళ్తూ.. ‘వస్తావా..’ అని ఆ యువతిని అడిగాడు. ఆమె రానని చెప్పింది. అప్పటికే మద్యం కోసం బయటకు వెళ్లిన వెంకటేశ్వరరావు తిరిగి వచ్చి తన గదిలో మద్యం తాగాడు. ఆ తర్వాత యువతి వద్దకు వచ్చి భోజనం చేద్దామని అడిగాడు. ఆమె సరే అనడంతో ఇద్దరూ కలిసి వంట చేశారు. నీచత్వంగా ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించింది. బయటకు వెళ్లి బండారం బయటపెడతానని బెదిరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు ఎక్కడ తన గురించి అందరికీ చెబుతుందోనని ఆమె నోరు గట్టిగా మూశాడు. బలవంతంగా కిచెన్‌లోకి తీసుకెళ్లాడు. చున్నీతో మెడకు ఉరిబిగించి చంపేశాడు.