ఆమె వయస్సు 50 ఏళ్లు. 38-12 ఏళ్ల మధ్య ఉన్న ఏడుగురు పిల్లలకు తల్లి. ఐదు పదుల వయస్సులో కూడా ఆమెలో కోరికలు తగ్గలేదు. ఆమె కన్ను 20 ఏళ్ల యువకుడిపై పడింది. ప్రేమ పేరుతో ఆ యువకుడికి దగ్గరైంది. చివరికి అతడితో కలిసి ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చత్తర్ పూర్ లో ఈ ఘటన జరిగింది. భార్య ప్రియుడితో జంప్ అయిన విషయం తెలుసుకున్న భర్త ఏప్రిల్ 20న ఎస్పీ ఆఫీస్ కు వెళ్లి మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. వారం రోజులుగా తన భార్య కనబడటం లేదని అతడు చెప్పాడు. తన వయస్సు 55 ఏళ్లు అని, 35 ఏళ్ల క్రితం తమకు వివాహం జరిగిందని, తమకు ఐదుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారని మగ్గురు కూతుళ్లకి పెళ్లిళ్లు అయి వారికి కూడా 18, 16ఏళ్ల కుమారులు ఉన్నారని తెలిపాడు.

కొద్ది రోజుల క్రితం పొలం పని మీద తాము చందేరాన్పూర్వా గ్రామానికి వెళ్లామని, పొలం పనిమీద ఓ 20 ఏళ్ల యువకుడు కూడా అక్కడకు వచ్చాడని, ఆ సమయంలోనే తన భార్య, ఆ యువకుడు ఫ్రెండ్స్ అయ్యారని తెలిపాడు. పంట పండిన తర్వాత గోధుమలు, నువ్వులు వచ్చాయని, దానితో పాటు తన దగ్గర కొంత నగదు కూడా ఉండిందని, అయితే తన భార్య పంట మొత్తాని అమ్మి ఆ వచ్చిన నగదుని, తన వద్ద ఉన్న నగదు తీసుకొని యువకుడితో పరారైందని భర్త తెలిపాడు. పొలం పని అయిన వెంటనే తన భార్య, యువకుడు కనిపించకుండా పోయారని, భార్యను కనిపెట్టే క్రమంలో తాను ఆ యువకుడి ఇంటికి వెళ్లగా, ఆ యువకుడి కుటుంబం తనను బెదిరించిందని, అనంతం వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపాడు. పంట అమ్మడం, తన వద్దనున్న నగదుతో భార్య పరారవడంతో ఇప్పుడు తమ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నాడు. పోలీసులు తన భార్యను కనిపెట్టి నిందితుడైన యువకుడిని అరెస్ట్ చేయాలని భర్త కోరుతున్నాడు.