లిప్ లాక్ కు రెడీ అంటున్నది తమన్నా

హీరోయిన్ తమన్నా పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దం దాటినప్పటికీ తన ఖాతాలో ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా వేసుకోలేక పోయింది. అందాల ఆరబోతతో తనకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయని అంటుంది. కొన్ని సినిమాలలో తన అందాలతో కుర్రకారుకు కాకపుట్టించిన ఈమె లిప్ లాక్ సీన్స్ మాత్రం ఏ సినిమాలోనూ చేయలేదు. కానీ, ఆ అవకాశం కేవలం ఆ ఒక్క హీరోకి మాత్రమే ఉన్నదని చెబుతుంది.

ఆ హీరోతో ఛాన్స్ వస్తే మాత్రం లిప్ లాక్ కు రెడీ అంటున్నది తమన్నా. ఇంతకీ ఆ హీరో ఎవరా అని అనుకుంటున్నారా? బాలీవుడ్ హీరో హ్రితిక్ రోషన్ అండి తమన్నాకు హ్రితిక్ రోషన్ అంటే చాలా ఇష్టమంట. గతంలో ఓసారి హ్రితిక్ ని కలసి ఫోటో దిగినప్పుడు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. తెలుగు, హిందీ భాషలలో హీరోయిన్లు లిప్ లాక్ లు చాలా అలవోకగా చేస్తున్నఈ సమయంలో కూడా తమన్నా మాత్రం తనకు ముద్దు సీన్లు అస్సలు కంఫర్ట్ గా ఉండలేనని తేల్చి చెప్పేసింది…