{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1581575910656","total_editor_time":1,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1581575780161","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మేడారం మహాజాతర వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలొచ్చారు. ఇష్టదైవాలను దర్శించుకున్నారు. తీరొక్క మొక్కులు చెల్లించుకున్నారు. కానుకలూ సమర్పించారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద ఏర్పాటు చేసిన 494 హుండీలను హన్మకొండలోని తితిదే కల్యాణ మండపానికి తరలించారు.

బుధవారం నుంచి కానుకల లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టారు. దేవాదాయ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ రామల సునీత, డిప్యూటీ కమిషనర్‌ నర్సింహులు, ములుగు ఆర్డీఓ రమాదేవి సమక్షంలో 64 హుండీలు తెరిచారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగింది.

తొలిరోజు ఆదాయం రూ. 1,01,50,000 వచ్చినట్లు మేడారం ఆలయ కార్యనిర్వాహక అధికారి టి.రాజేంద్రం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు లెక్కింపులో భాగస్వామ్యమయ్యారు. కల్యాణ మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హుండీల్లో నగదు, ఆభరణాలతో పాటు విదేశీ డాలర్లు కనిపించాయి. కొన్ని హుండీల్లో నోట్లు తడిసిపోయాయి. వాటిని ఆరబెట్టిన తర్వాత లెక్కించారు.