తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సరైన ధ్రువీకరణ పత్రాలతో స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. తాత్కాలిక ప్రాతిపదికన దినసరి వేతనంతో వీరిని విధుల్లోకి తీసుకోనున్నారు. డ్రైవర్లకు రోజుకు రూ.1500, కండక్టర్లకు రూ.1000 అందించనున్నారు. అలాగే మెకానిక్, ఎలక్ట్రిషియన్, టైర్ మెకానిక్‌, క్లరికల్ సిబ్బందికి రూ.1000 అందించనున్నారు. ఇక ఐటీ ట్రైనర్ నిపుణులకు రోజుకు రూ.1500 చెల్లించనున్నారు.

Job Notification Detail by RTC

కాగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలకు అసౌకర్యం కలగకుండా తాత్కాలిక ప్రాతిపదికగా ప్రభుత్వం కార్మికుల నియామకం చేపట్టనుంది. ఇదిలా ఉంటే,ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యతో కార్మికవర్గాలు మరింత భగ్గుమంటున్నాయి. ఉద్యమాన్ని మరింత ఉధృత చేస్తామని చెబుతున్నాయి.

ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఆర్టీసీకి మద్దతుగా నిలవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితోనే వ్యవహరిస్తుండటం గమనార్హం. యూనియన్లతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని 50వేల మంది కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని ప్రభుత్వం చెబుతోంది….