చర్చలపై సోమవారం కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉండటంతో ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు హాజరయ్యారు. సమావేశంలో కోర్టుకు ఇవ్వాల్సిన నివేదికపై నిశితంగా చర్చించారు. చర్చలు విఫలం కావడంతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. కేసీఆర్ కీలక ఆదేశాలు.. కాగా

ఆర్టీసీ సమ్మెపై తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుతోంది. ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలను బహిష్కరించి వెళ్లిపోయారని కోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం నివేదిక ఇవ్వనున్నది. ప్రత్యామ్నాయ చర్యలు వేగవంతం చేస్తూనే ఆర్టీసీలో అద్దె బస్సులను పెంచేందుకు మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ సందర్భంగా కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ రూట్లపై త్వరలో సర్వే నిర్వహించి రూట్లు, విధి విధానాలపై కసరత్తు చేయాలని మంత్రి, అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఇవాళ్టి సమీక్షతో ఫుల్‌స్టాప్ పడుతుందని అందరూ భావించారు. అయితే ఆ ఒక్కటి మాత్రం జరగలేదు.

ఇదిలా ఉంటే సోమవారం నాడు కలెక్టరేట్ల ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ పిలుపుకు కాంగ్రెస్ మద్దతిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు చర్చలకు ఎప్పుడు పిలిచినా రావడానికి మేం సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. సోమవారం కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసి 30న సకలజనుల సమరభేరి సభను విజయవంతం చేస్తామన్నారు…