{"source_sid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1596120916557","subsource":"done_button","uid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1596120692503","source":"other","origin":"unknown"}

● పెయింటింగ్స్ ఆవిష్కరణ.
● ప్రత్యేక చొరవచూపిన ఏ.ఈ. ని అభినందించిన కమీషనర్.
● హరితహారం కార్యక్రమం.

ప్రజలను ఆలోచింపజేసే విధంగా పెంటింగ్స్ ని ఏర్పాటు చేయడం, బాగుందని బల్దియా కమీషనర్ శ్రీమతి పమేలా సత్పతి అన్నారు. గురువారం బల్దియా సుబేదారి వాటర్ ట్యాంక్ ఆవరణలో గోడలకు సహజసిద్దంగా ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ని కమీషనర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ: గోడలు మాట్లాడుతాయా ! అన్న విధంగా పెయింటింగ్స్ ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలను చైతన్య వంతం చేసేలా, ప్లాస్టిక్ ఉత్పత్తులను ఏర్పాటు చేసిన తీరు బాగుందని, నీటి ఆవశ్యకతను చక్కగా వివరించారని, ఇంకుడు గుంతను సహజ సిద్ధంగా ఏర్పాటు చేయడం ప్రత్యేకత గా నిలుస్తుందన్న కమీషనర్, హరితహారం కార్యక్రమ ప్రశస్తయాన్ని చాటుతూ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చిత్రపటం వద్ద సి.ఎం.కు మొక్కను అందజేసినట్లుగా ఫోటోను తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఇట్టి కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఏ.ఈ.హరికుమార్ ను అభినందించారు. అనంతరం ఏర్పటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం లో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. వాటర్ ట్యాంక్ ఆవరణలో కలియతిరుగుతూ వాటర్ ఫౌంటెన్ ను పునరుద్ధరించాలని, ఆవరణలో విస్తృతం గా మొక్కలు నాటాలని ఈ.ఈ.ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈ.ఈ.రాజయ్య, డి.ఈ. సంతోష్ బాబు, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, హెల్త్ అసిస్టెంట్లు కిరణ్ కుమార్, అనిల్ కుమార్, సిబ్బంది రమేష్, రేణుక తదితరులు పాల్గొన్నారు.

డ్రై రిసోర్స్ సెంటర్ పరిశీలన:

వాటర్ ట్యాంక్ కార్యాలయ అవరణ లో ఉన్న డి.ఆర్.సి(డ్రై రిసోర్స్ సెంటర్)ను కమీషనర్ పరిశీలించి, సందర్శకుల పుస్తకం లో సంతకం చేసి పొడి చెత్త సేకరణ విధానం, తరలింపు, ప్లాస్టిక్ ను వివిధ సిమెంట్ పరిశ్రమలకు తరలింపు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పస్తూ చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో వావ్ సిబ్బంది కిరణ్, శ్రీను, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.