{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1625540666251","source":"other","origin":"gallery"}

కరోనా టీకా వేయించుకున్న తర్వాత కంటిచూపు తిరిగి వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది కదూ ? మహారాష్ట్ర వాషిమ్‌కు చెందిన 70 ఏళ్ల మధురాబాయి బిద్వే అనే వృద్ధురాలికి తొమ్మిదేళ్ల కిందట కంటి చూపు పోయింది. కాగా, జూన్‌ 26న ఆమె కోవిషీల్డ్ టీకా తొలి డోసు వేయించుకుంది. ఆ మరునాడు తన ఒక కంటిలో కొంతమేర చూపు వచ్చినట్లు మధురాబాయి తెలిపింది. 30-40 శాతం మేర చూడగలుగుతున్నట్లు చెప్పింది. అయితే ఆ వృద్ధురాలు చెబుతున్నది ఎంత వరకు వాస్తవం అన్నది వైద్యులు నిర్ధారించలేదు. కాగా, మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన అరవింద్ సోనార్‌ అనే వృద్ధుడు కోవిషీల్డ్‌ టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత తనకు అయస్కాంత శక్తి వచ్చిందని ఇటీవల తెలిపాడు.