కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన మట్టెల సంపత్, ఎంఎస్సీ, బీఈడీ, బీఎల్‌ఐఎస్సీ పూర్తి చేశాడు అతను మొన్నటి వరకు ఓ ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్‌ పది మంది టీచర్లకు ఉపాధిని కల్పించిన అతడు. నేడు తనకే ఉపాధి లేక ఓ చిరుతిండ్ల బండి పెట్టుకుని బతుకు బండిని భారంగా ఈడుస్తున్నాడు. విశేషం ఏమిటంటే ఆ మిర్చీ బండి పేరు నిరుద్యోగి అని రాసి తాన విద్యార్హతలను కూడా రాశాడు.