మండపేటలో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలుడు జషిత్‌ క్షేమంగా తిరిగొచ్చాడు. జషిత్‌ను పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు రోడ్‌లో జషిత్‌ను కిడ్నాపర్లు వదిలివెళ్లడంతో పోలీసులు క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్పీ నయీం స్వయంగా జషిత్‌ను ఎత్తుకుని తీసుకొచ్చి బాలుడి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. బాలుడు సురక్షితంగా తిరిగిరావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. కొడుకు జషిత్‌ను తల్లి నాగావళి ఆప్యాయంగా హత్తుకున్నారు.