ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి ఇప్పటికీ సరైన ఔషధం లేదు. శాస్త్రవేత్తలు ఇంకా కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ కనుగొనే పనిలో ఉన్నారు. ఎన్నో దేశాలు కరోనా వైరస్ కు మందు కనిపెట్టమని, త్వరలో అందుబాటులోకి తీసుకుని వస్తామని ప్రకటిస్తున్నాయి. ఇప్పటివరకూ యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్, రిటానవిర్, ఎబోలా డ్రగ్ రెమ్ డిసివర్ అనే మందులను కరోనా చికిత్సలో వాడుతున్నారు. తాజాగా బాంగ్లాదేశ్ లోని బంగ్లాదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చెందిన ఓ డాక్టర్ల బృందం కరోనా వైరస్ కు కొత్త మందు కనిపెట్టమని ప్రకటించింది.

వాళ్ళు తరచూ వినియోగించే వెర్మిక్టిన్ అనే యాంటీప్రోటోజోయల్ మందును ఓ సింగిల్ డోస్ తీసుకొని దానికి డాక్సీసైక్లిన్ అనే యాంటీ బయటిక్ ను కలిపి కరోనా వైద్యం కోసం వాడితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 60 మంది కరోనా వైరస్ పేషెంట్లపై ఈ రెండు రకాల మందులను కలిపి వాడమని తెలిపారు. మొత్తం 60 మందీ కోలుకున్నారని ప్రొఫెసర్ డాక్టర్ ఎండీ తారెక్ అలం తెలిపారు. తాము ఇచ్చిన మందుల కాంబోతో ఆ 60 మందీ నాలుగు రోజుల్లో కోలుకున్నారని తెలిపారు. కోలుకున్నవారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నారు. ఈ మందుల కాంబినేషన్‌ ను దేశంలో, ప్రపంచ దేశాల్లో అంతా వాడేలా ఏం చెయ్యాలో త్వరలో ప్రభుత్వ అధికారుల్ని కలిసి మాట్లాడతామని అలం అన్నారు.