వరంగల్: ఆస్తి పన్నులపై ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు పొందుటకు ఐదు రోజులు మాత్రమే మిగిలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకొవాలని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి నగర ప్రజలకు సూచించారు. ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటనలో ఆమె మాట్లాడుతూ: ప్రభుత్వం కల్పించిన బంపర్ ఆఫర్ 10వేల రూపాయల గృహోపయోగ ఆస్తి పన్నుపై 50% రాయితీ ఉందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని నగరాభివృద్ధికి కృషి చేయాలన్నారు.