తాలిబన్ల అరాచకాలు చెప్పుకుంటూ పొతే లెక్కే ఉండదు. అంతటి క్రూరులు వాళ్లు దయ దాక్షిణ్యం లేని కిరాతకులు, మానవత్వం లేని మృగాలు తాలిబన్లు తమ పైశాచికత్వాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మహిళలు ముసుగు ధరించలేదని హతమార్చడం, మాట వినని వారిని కాల్చివేయడం, కనిపించని మహిళలపై పశువుల్లా మీదపడి అత్యాచారం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇవన్నీ మచ్చుకు మాత్రమే వారి క్రూరత్వం ఎలా ఉంటుందో ఆఫ్గాన్ పోలీసు శాఖలో పని చేసిన ముస్కాన్ అనే పోలీసు అధికారిణి కళ్లకు కట్టినట్లు వివరించింది. ఇటీవల అక్కడి నుంచి తప్పించుకొని ఇండియాకు వలస వచ్చిన ఆమె తాలిబన్ల అరాచకాలను ఒక మీడియా సంస్థతో పంచుకున్నారు. “తాలిబన్లు అంటేనే అరాచానికి మారుపేరు. వారి కళ్లముందు మహిళలు తిరగకూడదు, ముసుగు లేకుండా అస్సలు కనిపించకూడదు. ఏ మహిళ అయినా ఉద్యోగం చేస్తున్నది అని తెలిస్తే చాలు ఆమెతో పాటు ఆమె కుటుంబానికి కూడా నూకలు చెల్లినట్లే. వారి దృష్టిలో మహిళలు అంటే సెక్స్ వర్కర్ లే, పదేళ్ల బాలికలను పెళ్లిళ్లు చేసుకొని బలవంతంగా అనుభవిస్తారు, కాదు కూడదంటే చంపేస్తారు.

ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వారిని చంపిన తరువాత వారి శవాలతో సెక్స్ చేస్తారు. మహిళలను చిత్ర హింసలకు గురిచేస్తూ ఆనందాన్ని పొందుతారు అలా వారు చనిపోయినా విడిచిపెట్టరు. ఆ శవంతోనే సెక్స్ చేస్తూ రాక్షసానందం పొందుతారు. వారు బతికి ఉన్నారా? లేరా? అన్నది వారికి అనవసరం. క్రూర జంతువులకంటే దారుణంగా వ్యవహరిస్తారు. ప్రతి కుటుంబం నుంచి ఒక అమ్మాయి వారివద్దకు వెళ్లాలి అనేది వారి రూల్ కూతురు లేకపోతే భార్య, భార్య లేకపోతే తల్లి, ఇలా ఎవరైనా ఆడది అయితే చాలు. వారికి మహిళలు సెక్స్ కోసం తప్ప దేనికి పనిరారు అనేది నమ్ముతారు. నా కళ్లముందే ఒక మహిళను వారు ఎత్తుకెళ్ళి, రేప్ చేసి చంపేశారు ఆమె చనిపోయాక కూడా వదలలేదు. ఆ దారుణాలు చూడలేకే నేను భారత్ కి వచ్చేశాను అని చెప్పుకొచ్చారు.