చందన్ ఆచార్య అనే ఆటో డ్రైవర్ తన భార్య, ఐదేళ్ల కూతురితో కలిసి చంద్రశేఖర్‌పూర్‌లోని పద్మావతి విహార్‌లో నివాసముంటున్నాడు. చందన్‌కు పదేళ్ల క్రితం పెళ్లయింది. ఆటో డ్రైవర్‌గా వచ్చిన సంపాదనతో చందన్, అతని భార్యాపిల్లలు ఏ లోటు లేకుండానే జీవించేవాళ్లు. అయితే.. పెళ్లయిన మూడేళ్ల తర్వాత చందన్ వ్యభిచార ముఠాలో సభ్యుడిగా మారాడు. విటుల కోసం యువతులను, మహిళలను తెప్పించి ఆ విటులిచ్చే కమీషన్‌కు అలవాటు పడ్డాడు. పెళ్లయిన మూడేళ్ల నుంచే తనతో కలిసి వ్యభిచార వృత్తిలో భాగమవ్వాలని, వేశ్యగా మారాలని భార్యపై చందన్ ఒత్తిడి చేశాడు. ఆమె అప్పటి నుంచి భర్తకు కుదరదని సర్ది చెబుతూ వస్తోంది.
ఇలాంటి పని చేయవద్దని, మానేయాలని భర్తకు సూచించింది. భార్యపై ఒత్తిడి చేయడం మానేసిన చందన్ తన ఇంటినే వేశ్య గృహంగా మార్చేశాడు. ఇంటికి విటులు వచ్చి పోతుండటంతో చందన్ భార్య చాలా ఇబ్బంది పడేంది. భర్తకు ఎదురు చెప్పలేక మౌనంగా అన్నీ భరించేది. అయితే, 5రోజుల క్రితం భార్యతో కూడా వ్యభిచారం చేయించాలని చందన్ భావించాడు. ఇంటికి వచ్చి ఆమెతో ఇదే విషయమై మాట్లాడాడు. ఆమె ఎంతకూ ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అదేరోజు రాత్రి, ఇంటికి తాగొచ్చిన చందన్ భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఎట్టి పరిస్థితుల్లో వేశ్యగా మారాల్సిందేనని భార్యను బలవంతం చేశాడు. అయితే,

అందుకు ఆమె ససేమిరా అనడంతో చందన్ మృగంలా మారాడు. విచక్షణ కోల్పోయి, భార్యపై దాడికి పాల్పడ్డాడు ఇనుప రాడ్‌తో ఆమెను గాయపరచడమే కాకుండా, ఆమె మర్మాంగంలో లిక్కర్ బాటిల్‌ను జొప్పించి హింసించాడు. కొద్దిసేపటికి ఆమె బాధను భరించలేక స్పృహ కోల్పోయింది. కూతురిని అల్లుడు హింసిస్తున్నట్లు తెలుసుకున్న బాధితురాలి తల్లి ఆమెను ఆసుపత్రికి తరలించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో లాక్ చేసిన గదిలో ఉన్న ఐదేళ్ల పాపను పోలీసులు కాపాడారు. భర్త చేసిన దుర్మార్గమైన పని వల్ల బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఆ బాధలో కూడా పోలీస్ స్టేషన్‌కు తల్లితో కలిసి వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు చందన్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.