బాలాజీనగర్‌లో నివాసం ఉండే చెంచురెడ్డి అనే వ్యక్తి విక్రమ సింహపురి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు ఉన్నారు. అందరికీ చదువు చెప్పే ఈ సారు గారు ఇంట్లో పనిచేసే మహిళతో కామ పాఠాలు నేర్చుకోవాలనుకున్నాడు. ఆ పనిమనిషి కూడా కోరినంత డబ్బులిస్తుండటం, అవసరాలు తీరుస్తుండటంతో ఆ ప్రొఫెసర్‌కు పూర్తిగా సహకరించింది. ఇంకేముంది ఇంట్లో వంటపని, ఇంటి పని పూర్తి చేసుకున్న వెంటనే ఈ పనిమనిషి, ప్రొఫెసర్ రొమాన్స్ చేసేవారు. వంటగదిలో పనిమనిషి ఉన్నప్పుడు భార్యకొడుకు కళ్లుగప్పి పనిమనిషితో సదరు ప్రొఫెసర్ సరసాలు ఆడేవాడు. కొన్నాళ్లకు చెంచురెడ్డి రాసలీలల సంగతి భార్యాకొడుకుకు తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని, ఇంట్లో ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు ఉన్నాడని భార్య మందలించింది. కొడుకు కూడా తండ్రికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. పనిమనిషిని కూడా పని నుంచి తీసేసి ఇంట్లో నుంచి పంపించేశారు. ఆమెను పనిలో నుంచి తీసేసినప్పటి నుంచి ఈ ప్రొఫెసర్ పద్ధతి మార్చుకోలేదు సరికదా సైకోలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

భార్యను వేధించసాగాడు మళ్లీ ఆ వంటమనిషిని పనిలోకి తీసుకోవాలని ఒకటే నస పెట్టేవాడు. కుదరదని భార్య, కొడుకు చెప్పడంతో సోమవారం అర్ధరాత్రి భార్య, కొడుకు ఇంట్లో నిద్రపోతుండగా ఇంటికి తాళం వేసి చెంచురెడ్డి ఎటో వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం చెంచురెడ్డి భార్య, కొడుకు నిద్రలేచి చూసేసరికి బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. చెంచురెడ్డి కూడా కనిపించకుండాపోయాడు. దీంతో.. ఏం చేయాలో పాలుపోని చెంచురెడ్డి కొడుకు 100కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. తన తండ్రే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడని, దయచేసి వచ్చి తమను కాపాడాలని కోరాడు. బాలాజీనగర్ సీఐ మంగారావు, సిబ్బంది చెంచురెడ్డి ఇంటికి వెళ్లి వారిని బయటకు తీసుకొచ్చారు. భర్త వైఖరితో రగిలిపోయిన భార్య చెంచురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నేల్లురు డీఎస్పీ నాగరాజు ప్రొఫెసర్‌ చెంచురెడ్డిపై కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.