ఈ మధ్య సోషల్ మీడియా వ్యాప్తి చెందిన తరువాత ముఖ పరిచయం కూడా లేని వారు పరిచయమవ్వడం ఆ తరువాత ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసే సంఘటనలు చాలా చూసాం. ఇలాంటిదే షాక్ గురి చేసే సంఘటన ఒకటి ఓడిశాలోని బాలాసోర్ లోని గులియానాలో జరిగింది. ఒక యువతీ కబాబుపాట్నాకు చెందిన ఓ యువకుడికి పేస్ బుక్ పరిచయమయింది. ఇక పరిచయం కాస్త కొన్ని రోజులు ప్రేమగా మారడం అనే సంగతి అందరకి జరిగినట్లే వీరిద్దరకు జరిగింది. ఇక ఆ యువతకి ఒక రోజు అతడిని ఒంటరిగా కలవాలని తలచి ఆ అమ్మాయి తల్లితండ్రులు ఒక రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లడంతో అతడిని ఇంటికి రమ్మని పిలిచిందే. ఇక ఆ పిల్ల అడగడం అతగాడు పరిగెత్తుకుంటూ రావడం జరిగిపోయాయి. ఇది గమనించిన పక్కింటి వారు అమ్మాయి తల్లితండ్రులకు విషయాన్ని చేరవేయగా వాళ్ళు వచ్చి ఊరందరి ముందు పంచాయితీ పెట్టి అతగాడితో తమ కూతురుకి పెళ్లి చేయడంతో ఆ ఏరియాలో సంచలనంగా మారింది.