టెన్త్ క్లాస్ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్. న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (IARI) టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

  • మొత్తం ఉద్యోగాల సంఖ్య: 641
  • దరఖాస్తుకు చివరి తేది: 2022 జనవరి 10.
  • విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది.
  • వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య కల్గి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 వేతనం చెల్లిస్తారు.
  • దరఖాస్తు ఫీజు:రూ.700, మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.
  • పరీక్ష తేదీలు: 2022 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 మధ్య పరీక్షలు ఉంటాయి

నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.iari.res.in వెబ్ సైట్ ను చూడొచ్చు..