{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1624553631506","source":"other","origin":"gallery"}

రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ప‌రిస్థితి విష‌మంగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. కొద్ది గంట‌లు గ‌డిస్తే కాని ఆయ‌న ఆరోగ్యం గురించి ఏం చెప్ప‌లేమ‌ని వైద్యులు అంటున్నారు. తాజాగా పూన‌మ్ కౌర్ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావ్, వదిలేశావ్. ఏళ్ల నుంచి పద్దతిగా తన పని తాను చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని నువ్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావ్ అని. ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్ అని పూనమ్ కౌర్ ట్వీట్ వేశారు. పూన‌మ్ కౌర్ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో క‌త్తి మ‌హేష్‌, పూన‌మ్ కౌర్, ప‌వన్ క‌ళ్యాణ్‌కి సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జరిగింది. కత్తి మ‌హేష్ ప్ర‌మాదంపై జన సైనికులు కౌంటర్లు వేస్తున్నారు. కాగా, కొడ‌వ‌లూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటెనర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం స్పెషల్ ఇసోలేషన్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కత్తి మహేష్‌ది సొంత జిల్లా చిత్తూరు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్ కి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. అయితే త‌ల‌కి బ‌ల‌మైన గాయం అయిన‌ట్టు తెలుస్తుంది.