ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది లోపే సిబ్బంది అని సీఎం అన్నారు. గడువు పూర్తయ్యే లోపల, అంటే ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతి త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా కొత్తగా వచ్చే కార్మికులు ఏ యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బందిది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ వుంటుందని సీఎం స్పష్టం చేశారు.

ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులని, మిగితా సగం ఆర్టీసీవని, ఈ పద్ధతిలో చర్యలు చేపడితేనే బస్సులు బాగా నడుస్తాయని సీఎం అధికారులతో అన్నారు. పండగ సమయంలో ఆర్టీసీ సమ్మెతో సిబ్బంది మీద చాలా కో్పంగా ఉన్నారని, సోషల్ మీడియాలో కూడా వారిపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని కేసీఆర్ అన్నారు.