హైదరాబాద్: మున్సిపల్‌ వ్యవస్థను అవినీతి రహితం చేస్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పట్టణాల్లో 75 చదరపు గజాల వరకు పేదల ఇళ్లకు పర్మిషన్లు అక్కర్లేదన్నారు. పట్టణాల్లో జీ ప్లస్‌ వన్‌ ఇళ్ల నిర్మాణానికి పరిష్మన్లు అక్కర్లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రాపర్టీ టాక్స్‌ సంవత్సరానికి రూ.100 మాత్రమేనన్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1 మాత్రమేనన్నారు. మున్సిపాలిటీల్లో అన్ని పర్మిషన్లు పారదర్శకంగా ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక నుంచి నగర పంచాయతీలు ఉండవని స్పష్టం చేశారు. మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు మాత్రమే ఉంటాయన్నారు. కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పిస్తున్నట్టు కేసీఆర్‌ స్పష్టం చేశారు.