ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న తమ గురువుకి నగదు సాయం చేయడానికి ముందుకొచ్చారు విద్యార్థులు. అయితే ఆయన ఆత్మాభిమానం అందుకు ఒప్పుకోలేదు. అందుకే గురువుతో ఓ చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందుల్లో అండగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రుద్రంగి జడ్పీ హైస్కూల్ లో 1997-98 సంవత్సరం పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ సాయం చేశారు. ఆ సాయాన్ని ఇలా గురువు పదిమందికి చెప్పుకున్నారు. తన విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకున్నారు.