కేసీఅర్ గారు ఎక్కడున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఆరేళ్లుగా మీడియా ముందుకు రాకుండా మోదీ గారు ఎక్కడ నుండి రికార్డింగ్ వీడియోలు చేస్తున్నారో ఎవరికయినా తెలుసా ? కరోనాతో వివిధ దేశాలు అల్లాడిపోతున్న సందర్భంలో ఆయా దేశ ప్రధానులు ప్రజల ముందుకు వచ్చి వారికి ధైర్యం చెబుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు కరోనా కేసుల విషయంలో మూడో స్థానంలో ఉన్న మనకు మాత్రం మన ప్రధాని వీడియో రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రధాని అందుబాటులో లేడు. ఇది చింతించ వలసిన విషయం. 130 కోట్ల దేశ ప్రజల దురదృష్టం. ఇలా విమర్శించుకుంటూ పోతే కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను అన్నీ ఇన్నీ కావు. దేశప్రధాని ఉంటున్న న్యూఢిల్లీ కరోనా కేసుల విషయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మరి ప్రధాని నిద్రపోతున్నాడా ?

విమర్శలు చేయడం అందరికీ తెలుసు. గతంలో కనీవినీ ఎరుగని మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు పోవాల్సిన సందర్భంలో సంస్కారం మరిచి ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఇప్పటికైనా మీ కుత్సిత బుద్దిని మార్చుకోండి. దేశ ప్రధానిని అవమానిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అని ప్రధానికి బాసటగా నిలిచిన గొప్ప నాయకుడు సీయం కేసీఅర్ గారు. అదేవిధంగా మీరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించడం మీ కనీస సంస్కారం. ప్రజలకు తోడుగా నిలిచి మీకిచ్చిన నాలుగు ఎంపీ సీట్లకు న్యాయం చేయండి.