రాంచీకి చెందిన రాజేష్ కు ఇద్దరు భార్యలు.! దీంతో వారి మద్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మొదటి భార్య ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భర్త నా దగ్గరకు రాట్లేడని భర్త మీద, నా భర్తను నా దగ్గరకు రాకుండా చేస్తుందని రెండో భార్య మీద కంప్లైంట్ చేసింది. అప్పటికే ఈకేసు తో రెండు మూడు సార్లు ఇబ్బందిగా ఫీల్ అయిన స్టేషన్ మాస్టర్.
రాజేష్ ను అతని ఇద్దరి భార్యలను పిలిపించాడు. వాళ్ల కుటుంబ సభ్యుల మద్యనే ఓ కండీషన్ పెట్టాడు. సోమ, మంగళ, బుధ వారాలు రాజేష్ మొదటి భార్య వద్ద ఉండాల్సిందిగా, గురు, శుక్ర, శని వారాలు రెండో భార్య దగ్గర ఉండాల్సిందా, మిగిలిన ఆదివారం రెస్ట్ గా లేదంటే తనకిష్టమైన భార్యతో ఉండేలా షరతు పెట్టారు. ఈ కండీషన్ కు ముగ్గురూ ఒప్పుకోవడంతో సమస్య సుఖాంతమైంది.!