టాలీవుడ్ ప్రముఖ నిర్మాత పై దిల్ రాజు రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధ‌మైయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా తన రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో స్వయంగా స్పందిస్తూ దిల్ రాజు పోస్ట్ చేశారు. ట్వీట్ లో దిల్ రాజు గత కొన్ని రోజుల నుంచి మంచి క‌లిసి రాలేదు. అంతా త్వరలోనే సర్దుకుంటుందని, అందరికీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా.

అదే ఆశతో నా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా. అందుకు ఇదే అదునైన సమయంగా భావిస్తున్నా” అని దిల్ రాజు పేర్కొన్నారు. దిల్‌రాజు రెండో వివాహం నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో ఈ రోజు (ఆదివారం) రాత్రి చేసుకోబోతున్నారు. లాక్ డౌన్ ప్ర‌భావంతో 10 మందిలోపు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో దిల్‌రాజు పెళ్లి జరగనుందని సమాచారం.

గ‌తంలోనే దిల్ రాజు రెండో పెళ్ళికి సిద్దమయ్యారనే వార్తలు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత మూడేళ్ళ క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యంతో మరణించారు. మరో పెళ్లి చేసుకొవాలని దిల్ రాజు సన్నిహితులు చెప్పార‌ని, దీంతో ఆయన రెండో పెళ్లి చేసుకునేందుకు వార్త‌లు వ‌చ్చాయి. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నార అప‌ట్లోనే టాక్ వచ్చింది. అప్ప‌ట్లో దిల్ రాజు ఈ వార్త‌ల‌ను ఖండిచారు. తాజాగా దిల్ రాజు స్వ‌యంగా త‌న ట్విట‌ర్ లో ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇవాళ సాయంత్రం రెండో వివాహం చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.