హుజురాబాద్ ఉపఎన్నికల్లో బిజెపి తరుపున బరిలోకి దిగుతున్న ఈటెల రాజేందర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ప్రస్తుతం పాదయాత్ర పేరుతో ఈటెల నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని వీణవంక మండలం ఎలబాక గ్రామంలో ప్రజలు ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈటల పంపిన గోడగడియారాలను గ్రామస్తులు పగలకొట్టారు. ఈటల తమ గ్రామములో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని కేసీఆర్ కే తమ ఓటు వేస్తామంటూ నినాదాలు చేశారు.

ఎలబాక కాలనీ వాసులందరూ కలిసి కారు గుర్తుకు ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఘటనతో ఈటెల షాక్ అయ్యారు. ఇదిలా ఉంటె ఇల్లందకుంట మండలం ఎంపీపీ పావని, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, ముగ్గురు సర్పంచ్‌లు మండల ఇంచార్జ్, ఎమ్మెల్యే రవి శంకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.