సెలవుల కారణంగా పట్టణాలలో గ్రామాలలో విద్యార్థులు, యువకులు పొలాల వెంట, బావుల వెంట చెరువుల వెంట తిరిగి కాలక్షేపం సాగిస్తున్నారని బావులలో చెరువుల్లో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి మునిగి తమ కుటుంబాలకు తీరని శోకం కల్గిస్తున్నారని జిల్లా ఎస్.పి. శ్రీమతి జి. చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా యెస్.పి గారు మాట్లాడుతూ: ప్రస్తుత సెలవులు ఎండవేడితో ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో ఎక్కడైనా బావుల్లో, చెరువుల్లో, కాల్వల్లో ఈతలకు వెళ్లి సేదతీరుతుంటారని, ఈతల వల్ల శారీరక దారుడ్యం పెరుగుతుందనేది వాస్తవేమే అయినా ఈ మాటేలా ఉన్నా ఈత నేర్చు కొవాలనే చాలా మంది పిల్లలు ఉత్సాహం చూపుతుంటారు.

ఈతలో అజాగ్రత్తల వల్ల విలువైన ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారని. ఇలాంటి విషాద ఘటనలు తలెత్తకుండా ఉండాలంటే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొవడంమంచిదిని, ఈతలకు వెళ్లే సంధర్భంల్లో తల్లిదండ్రులు బాధ్యతను తీసుకొని వెంట వెళ్లి ఈతలను నేర్పించడం మంచిదని, ఎండ వేడిమి తంటుకొలేక చిన్న పెద్ద తేడా లేకుండా అందరు వేసవిలో ఈతలకు వెళ్లి సేదతీరుతుంటారని, ఇలా వెళ్లి గతంలో చాలా మంది కుంటల్లోని చెరువుల్లోని నీళ్లల్లో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారని, ఇలాంటి సంఘటల వల్ల తల్లిందడ్రులకు గర్భశోకం మిగులుతుందిని, ఇలాంటి సంఘటనలు పునఃరావృత్తం కాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు అవసరంని అన్నారు.

బావుల్లో, కాలువల్లో, చెరువుల్లో ఈతలకు వెళ్లేప్పుడు తప్పనిస రిగా పెద్దలను వెంట పెట్టుకుపోవాలని, కాలువలు తవ్వేప్పుడు రాళ్లను పేల్చి ఉంటారు కాబట్టి దీంతో ఈతల కు వెళ్లేప్పుడు కాలుల్లో ప్రమాదాలు జరిగే వీలుందని అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం అని, ఈతలకు వెళ్లే వాళ్లు ఈ మద్య కాలంలో వాటర్ క్యాన్‌లను గాని, వాటర్ బాటీళ్లను గాని బెండుగా వాడుతున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలే ఎక్కువ అని అన్నారు.

  • ఈతలకు వెళ్ళే చిన్నారుల పైన తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని.
  • ఈతకు వెళ్లవలసి వస్తే వీరి పర్యవేక్షణలోనే ఈతలు నేర్చుకొవాలని తెలిపినారు.
  • ఈతకు వెళ్ళే పిల్లలు ముఖ్యంగా ఒకరిపై ఒకరు దూకడం, దాగుడుమూతలు, వంటి పనుల వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఆ సమయాల్లో తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా గమనించాలని కాలువ ల్లో నిలువ ఉన్న నీళ్లల్లో ఈతకు పోకపోవడమే మంచిదిని అన్నారు.
  • ప్రతి వ్యక్తికి ఈత నేర్చుకొవాలన్న సరదా ఉంటుందని.
  • శిక్షకులు, నిపుణులు లేకుండా ఈతలు రానివారు ఈతలకు వెళ్లవద్దని తల్లిదండ్రులు పర్యవేక్షణ తప్పనిసరి అని అది వారి భాద్యత అని అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు జరుగవచ్చని జాగ్రత్తలు పాటించకుండా పిల్లలను ఈతలకు పంపించవద్దని తల్లిదండ్రులు ఇట్టి విషయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు.