చందన దీప్తి కళ్యాణం, చూతము రారండి!!
చందన దీప్తి గారి చిన్ననాటి నేస్తం బలరాముడు.
ఆ దైవమే కరుణించగా! భాష్యం మధు పురోహితుడై !!
ఈరోజు శుభ ముహూర్తమే నిర్ణయించగా.
మత్త కోకిలలు ముత్తైదువులై !!
మంగళ గీతాలు పాడనున్నాయి!

సిరి కళ్యాణపు బొట్టును పెట్టీ !! మణి బాసికమును నుదుటను కట్టీ! !! పారాణిని పాదాలకు పెట్టీ!! పెండ్లి కూతురై వెలసిన చందన దీప్తి !! కల్యాణం, చూతము రారండి..

బలరాముడు దోసిట కెంపుల ప్రోవై, చందన దీప్తి దోసిట నీలపు రాశై !! ఆణిముత్యములు తలంబ్రాలుగా…
శిరముల మెరిసిన చందన దీప్తి బలరాముడు,
కల్యాణం, చూతము రారండి…