క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌తిఒక్క‌రూ ఇమ్యునిటీ ప‌వ‌ర్ పెంచుకునే ప‌నిలో ఉన్నారు. పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, బెల్లం, దాల్చిన చెక్క‌, ప‌సుపు వంటి ఇంగ్రీడియంట్స్‌తో కూడా రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకుంటున్నారు. వీట‌న్నిటిక‌న్నా హ‌నీడ్యూ మెల‌న్ పండుని తింటే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని గ్రీన్ మెల‌న్ అని కూడా అంటారు. ఇది తిన‌డం వ‌ల్ల బ‌రువు కూడా త‌గ్గుతారు.

  • ప‌చ్చ రంగులో ఉంటుంది కాబ‌ట్టి దీన్ని గ్రీన్ మెల‌న్ అని అంటారు. ఇది ర‌క‌ర‌కాల సైజులో ఉంటుంది. ఒక క‌ప్పు గ్రీన్ మెల‌న్‌లో 64 కేల‌రీలు ఉంటాయి. ఇందులో 1.4 గ్రాముల ఫైబ‌ర్ ఉంటుంది.
  • గ్రీన్ మెల‌న్‌లో యాంటీ ఆక్సిడెంట్ విట‌మిన్ సి స‌మృద్దిగా ల‌భిస్తుంది. అలాగే ఎలెక్ట్రోలైట్ పొటాషియం ఉంటుంది. శ‌రీరంలో ఫ్లూయిడ్ బాల‌న్స్‌ను మెయింటెయిన్ చేయ‌డానికి గ్రీన్ మెల‌న్ సాయ‌పడుతుంది. ఇందులో కేల‌రీలు త‌క్కువ‌గా ఉండి, పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి.
  • గ్రీన్ మెల‌న్ తిన‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా త‌యార‌వుతాయి. క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, మెగ్నీషియం, పొటాషియం వంటి మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఫోలేట్ అనే ముఖ్యమైన మాక్రో న్యూట్రియెంట్ కూడా బోన్ హెల్త్ కు సపోర్ట్ చేస్తుంది.