మొబైల్స్ లో ఫొటోలు , వీడియో తీశారు కాని ఒక్కరు కూడా

చెత్తతీసుకుపోయే ఈ బండిలో ఉన్నది సుబ్రమణి అనే పేదవాడి శవం బండిలాగుతున్నది సుబ్రమణి భార్య. వెనుక బండితోస్తున్నది సుబ్రమణి సోదరుడు క్షయ వ్యాధితో ఆరోగ్యం క్షీణించిన సుబ్రమణిని ఈ బండిలోనే ఆసుపత్రికి తీసుకుపోయారు. అప్పటికే అతడు చనిపోయారు. తరువాత అదేబండిలో 24 కిలోమీటర్ల దూరంలోని విల్లుపురం జిల్లాలోని స్వగ్రామానికి తీసుకుపోయేందుకు బయలుదేరారు.

ఈ విషాద సన్నివేశం చూసిన ఒక పోలీసు అధికారి , స్వచ్చంద సంస్థకు చెందిన అంబులెన్స్ ను పిలిపించి , ఖర్చులకు డబ్బులిచ్చి ఈ పేదవాడి శవాన్ని సాగనంపాడు. పాండిచ్చేరి లో జరిగిన ఈ సంఘటనను అందరూ తమ మొబైల్స్ లో ఫొటోలు, వీడియో తీశారని ఒక్కరు కూడా అంబులెన్స్ ను పిలిచి వారికి సాయంచేయాలని అనుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు…