ఈ చిన్నారి పేరు సింధూరి, వయసు పదేళ్లు. మణికట్టు వరకు ఎడమచెయ్యి లేదు. అయినా సరే చదువుతోపాటు ఆటపాటల్లో ముందుంటుంది సింధూరి. అంతే కాదు, సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. కర్నాటకలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా, విద్యార్థులకు ఉచితంగా మాస్క్ లు కుట్టి పంపిణీ చేస్తోంది సింధూరి. ఉడుపి కేంద్రంలో పదో తరగతి పరీక్షలు రాసేవారికి ఈ మాస్కులు తానే స్వయంగా అందిస్తోంది. ఈమె సేవను అధికారులు గుర్తించి ప్రత్యేకంగా ప్రశంసించారు.