ఈ ప్రేమ జంట ఇప్పుడు సంచలనాలకు కేంద్రమైంది. రెండు మతాలకు చెందిన కుషి , సుమిత్ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. దీంతో అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి సుమీత్ ఉండే ఢిల్లీలోని హరిజన్ బస్తీకి వెళ్లి, ఇళ్లలో సామాను ధ్వంసం చేసి, వాహనాలపై దాడిచేసి, భీబత్సం సృష్టించారు. ఈ కేసులో షబానా అనే మహిళతో సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గొడవలు, మాకెందుకు, మేమిద్దరం ఇష్టపడ్డాం, పెళ్లిచేసుకున్నాం, మాకు రక్షణ కల్పించండి అంటూ ఈ ప్రేమ జంట పోలీసులను కోరింది. మేము మనుషులం, మతాలగురించి పట్టించుకోము అంటున్నారు.

మతం పేరుతొ మనుషులను విడదీస్తారా అంటూ ప్రశ్నించారు. పెళ్ళైన తాము, తమ ప్రాంతానికి పోయి ఉంటామని అడుగుతున్నా, ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఆలోచిస్తున్నారు. తమ ప్రాణాలకు భద్రత కల్పించాలని, ప్రేమికులిద్దరూ ప్రధానికి, రాష్ట్రపతికి ఒక వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. అమ్మాయి తల్లి బనీసా మాత్రం, తమను వదిలేసిపోయిన కూతురుతో తమకు సంబంధం లేదని చెప్పారు. అయితే తాము బయటకు వస్తే తమను చంపేస్తారని ప్రేమికులిద్దరూ చెబుతున్నారు.