ప్రియుడికోసం పిల్లలతోసహా భర్త ,మామలను చంపాలని పాయసంలో విషంకలిపిన నీచురాలు ఆమె. పాయసం తగి అందరూ చనిపోయారని భావించి తెల్లవారుజామున ప్రియుడితో ఉడాయించింది..

కరీంనగర్‌ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారన్న కారణంతో భర్త, మామ, తన ఇద్దరు పిల్లలకు పాయసంలో విషం కలిపి హత్యకు యత్నించిదో భార్య. గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విలాసాగరం అంజయ్య, ఉమ భార్యభర్తలు. ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఉమకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది.

దీనికి అడ్డు వస్తున్నారనే కారణంతో గురువారం రాత్రి ఉమ తన భర్త అంజయ్య, మామ రాజేశంతోపాటు పిల్లలు సిద్ధార్థ, మాన్వితకు పాయసంలో విషం కలిపి వడ్డించింది. పాయసం తిన్న కొద్దిసేపటికే ఈ నలుగురు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరికి విషమిచ్చిన అనంతరం శుక్రవారం తెల్లవారుజామున ఆమె తన ప్రియుడితో కలిసి ఊరువిడిచి వెళ్లిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న నలుగురిని గమనించిన అంజయ్య తల్లి లక్ష్మి స్థానికులకు సమాచారమందించింది. ప్రస్తుతం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నారు.