జిల్లాలో పనిచేస్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించే కీలకమైన శాఖ రిజిస్ట్రేషన్ శాఖలో 10 సంవత్సరాలు సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తూ రెండు జిల్లాల ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న ఉత్తమ జిల్లా అధికారిణిగా ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ముహమ్మద్ అవార్డు అందుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 11వ సారి ఉత్తమ జిల్లా అధికారిణిగా జయశంకర్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీహర్షిని చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.