వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేగా ఉద్యోగ మేళకు అనుహ్య స్పందన వచ్చిందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల అధ్వర్యంలో సుబేదారిలోని ఆర్ట్స్‌ సైన్స్‌ ఆడితోరియంలో ఏర్పాటు చేసిన మేగా ఉద్యోగ మేళాను శుక్రవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రారంభించారు, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి వారికి దశ-దిశ నిర్థేశించేందుకుగాను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అధ్వర్యంలో మేగా ఉద్యోగ మేళా ఏర్పాటు చేయడం జరిగింది.

వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల అధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా ఏర్పాటు చేయడంతో ఈ రోజు ఉదయంలో పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చి తన పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, రాష్ట్రంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌, రియల్టర్‌, ఫార్మసీ, మెడికల్‌, మార్కెటింగ్‌ రంగాలకు సంబంధించిన సంస్థల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి ఆవకాశాలను కల్పించేందుకుగా ప్రముఖ మల్టీనేషనల్‌ కంపేనీలతో పాటు, స్థానిక కంపెనీలు ఈ ఉద్యోగ మేళా ద్వారా ఆర్హత, అనుభవం వున్న యువతను తమ సంస్థల కోరకు అవసరమైయిన సిబ్బంది కోసం ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది.

ఈ సందర్బంగా పోలీసు కమిషనర్‌ మాట్లాడుతూ: మా ఉద్యోగ ధర్మంతో పాటు యువతకు సేవలందించాలనే అలోచనతో ఈ ఉద్యోగ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని. ముఖ్యంగా ఈ మేళాలో ఉద్యోగాలు రాని యువత ఈ అనుభవంతో తాను ఎందుకు ఎంపిక కాలేదని ప్రశ్నించుకోని తనలోని తప్పులను సరిదిద్దుకోని రానురోజుల్లో ఉన్నత ఉద్యోగాలను సాధించేందుకు కృషి చేయాలని, నేటి యువత పాజిటీవ్‌ ఆలోచిస్తూ ముందుకు సాగిపోతే తప్పక విజయం సాధిస్తారని.

యువత తమ లక్ష్య సాధనకై శ్రమించాలి:

ప్రతి ఒక్కరిలో సాధించాలనే తపన వుంటే సాధించాలకున్న లక్ష్యాలు సులభంగా సాధించగలరని. యువత తమ లక్ష్య సాధనకై శ్రమించే సమయంలో తన చుట్టు పరిసరాలు, అవసరాలు అన్ని కూడా లక్ష్య సాధన అడ్డుగా నిలుస్తాయి. వీటన్నింటిని ఎదుర్కోని ముందుకి సాగిపోతారో వారు జీవితంలో ఉన్నత శిఖిరాలను అధిరోహిస్తారని డాక్టర్‌ ఆబ్దుల్‌ కలాం చేప్పిన మాటలను నేటి యువత గుర్తుకోవాల్సిన అవసరం వుందని, ప్రతి ఒక్కరిలో కృషి, పట్టుదల వుంటే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని, పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.

ఈ మేళాకు మొత్తం 2వేలపైగా నిరుద్యోగ యువత హజర్‌ కాగా ఇందులో 782 మందిని వివిధ కంపెనీల్లో ఎంపిక చేయడం జరిగింది. అనంతరం ఈ మేళాకు హరజరయిన యువతతో పోలీస్‌ కమిషనర్‌ ముచ్చటించడంతో పాటు, ఉద్యోగ మేళా నిర్వహరణకు సంబంధించి సంబంధించిన కంపెనీ ఉద్యోగుల నియామక ప్రతినిధులను అడిగితెలుసుకున్నారు…