మంత్రి సబితారెడ్డిపై మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నాయకుడు మధుయాష్కీ చేసిన వ్యాఖ్యల్తో తప్పేముందని ఆ పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఉన్న మాటంటే ఉలుకెందుకని వారు నిలదీశారు. శుక్రవారం బాలాపూర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ నేతలు మధుయాష్కీ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని నిరసిస్తూ శనివారం కాంగ్రెస్‌ మీర్‌పేట్‌ పట్టణ కమిటీ అధ్యక్షుడు సామిడి గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్‌ చౌరస్తాలో మంత్రి సబితారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, ఏ. జంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ బీఫామ్‌ మీద గెలిచి టీఆర్‌ఎ్‌సలో చేరిన సబితారెడ్డిపై మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు నిజం కాదా.? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి వై.అమరేందర్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బంగారు బాబు, కె.అమరేందర్‌రెడ్డి, పద్మ, అంజన్‌, స్వామినాయక్‌, మహేశ్వర్‌రెడ్డి, శివప్రసాద్‌, సమద్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, మల్లేశ్‌, ధన్‌రాజ్‌గౌడ్‌ పాల్గొన్నారు.