తెలంగాణ: మునుగోడు ఉప ఎన్నిక సంద‌ర్భంగా స్థానికంగా సెల‌వు ప్ర‌క‌టిస్తూ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ రోజు స్థానికంగా సెల‌వు ప్ర‌క‌టించేందుకు న‌ల్ల‌గొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. పోలింగ్ కేంద్రాలున్న కార్యాల‌యాలు, సంస్థ‌ల‌కు పోలింగ్ ముందు రోజు కూడా సెల‌వు ఇవ్వాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసే కార్యాలయానికి లెక్కింపు రోజున కూడా సెలవు ఇవ్వాల‌ని ఆదేశించింది..