కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న పారిశుధ్య కార్మికురాలు కొద్ది సేపట్లోనే కోమాలోకి వెళ్లింది. పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధిలోని హెల్త్‌ సెంటర్‌లో ఈ సంఘటన జరిగింది. పీర్జాదిగూడలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఎన్‌.లత(30) శనివారం సాయంత్రం స్థానిక హెల్త్‌ సెంటర్‌లో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంది. తర్వాత కొద్దిసేపటికే ఆమె అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయింది. దీంతో లతను అత్యవసర చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.