{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584373438905","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584373409300","source":"other","origin":"unknown"}

అపరిచితులకు, సంఘ విద్రోహ శక్తులకు ఆశ్రమం ఇవ్వద్దని ఏఎస్పీ సాయి చైతన్య, పస్రా సిఐ అనుముల శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై రవీందర్ లు అన్నారు. ఆదివారం రెండు టీములుగా ఏర్పడి బయ్యక్కపేట గ్రామం పరిధిలో గల నీలాల తోగు గొత్తికోయ గుంపు, కాల్వపల్లి పరిధిలోని గొత్తికోయ గుంపులో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గొత్తికోయ గూడాలకు చేరుకొని గుడిసెలలో సోదాలు నిర్వహించారు. ప్రతి వ్యక్తికి, మహిళలకు, యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: సంఘవిద్రోహ శక్తులకు అపరిచితులకు ఆశ్రమం కల్పించవద్దని తెలిపారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు, శిక్షార్హులవుతారని తెలిపారు. ప్రజా ఆమోదం లేని సిద్ధాంతాలతో మావోయిస్టు పోరాటం వృధా అని తెలిపారు.

మావోయిస్టుల మాయ మాటలు నమ్మొద్దని సూచించారు. మీకు ఏలాంటి కష్టాలు, ఇబ్బందులు వచ్చిన చట్టం ప్రకారం అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం నీలాల తోగు గొత్తికోయ గుంపు లోని యువకులకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. గొత్తికోయ యువకులు చెడు వ్యసనాలకు లోను కాకుండా బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

అనంతరం నార్లపూర్ లో గుడుంబా స్థావరాల పై దాడులు నిర్వహించారు. నార్లపూర్ పరిసర ప్రాంతాలలో ఎనభై లీటర్ల గుడుంబా, వెయ్యి లీటర్ల బెల్లం పానకం ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ: చట్టవ్యతిరేకమైన గుడుంబా తయారీ, మత్తు పదార్ధాలు అమ్మకం, తదితర కార్యక్రమాలు నిర్వహించిన వారికి చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని అన్నారు. ప్రతి ఒక్కరు విద్యావంతులై సన్మామార్గంలో పయనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లో ఏఎస్సై చంద్రమోహన్, సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.