రాష్ట్రంలో సోమవారం 1198 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 46,274 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ ఏడుగురు మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 422కు చేరింది. ఇవాళ 1885 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 34,323మంది డిశ్చార్జి అయ్యారు. మరో 11,530 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం 11,003 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 2,65,219 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో: ఒక్క జీహెచ్‌ఎంసీలో 510 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 106 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 76 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 10 కేసులు, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌‌ జిల్లాలో 73 కేసులు, క‌రీంన‌గ‌ర్‌‌ జిల్లాలో 87 కేసులు, జ‌గిత్యాల‌‌‌ జిల్లాలో 36 కేసులు, మ‌హ‌బూబ‌బాద్ జిల్లాలో 36 కేసులు, మెద‌క్ జిల్లాలో 13 కేసులు, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో 50 కేసులు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 11 కేసులు, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో 26 కేసులు, న‌ల్గొండ‌ జిల్లాలో 24 కేసులు, అదిలాబాద్ జిల్లాలో 11 కేసులు, నాగ‌ర్ క‌ర్నూల్‌ జిల్లాలో 27 కేసులు, జ‌న‌గాం జిల్లాలో 12 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 31 కేసులు, సూర్యాపేట జిల్లాలో 12 కేసులు చొప్పున‌ నమోదయ్యాయి. గ‌త 40‌ రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.