2023 ఎన్నికల నాటికి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కమలదళం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళోంది . ఆపరేషన్ ఆకర్ట్ చేపట్టి కాంగ్రెస్ , టీడీపీలతో పాటు అధికార టీఆర్ఎస్ నుంచి కూడా పలువురు కీలక నేతలను లాగుతోంది . ఈ క్రమంలో ఇప్పటికే దాదాపుగా అన్ని జిల్లాల నుంచి కీలక నాయకులను తీసుకుంది . తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా ఎంపీ కూడా బీజేపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది . టీఆర్ఎస్ ఎంపీగా ప్రస్తుతానికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా . కాస్త తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది, ఎందుకంటే తాను బీజేపీలోకి వెళ్తే దేశ రాజకీయ చరిత్రలోనే రికార్డు సృష్టించే అవకాశం ఉంటుందనే ఆలోచనలో ఆ మహిళా ఎంపీ ఉన్నట్లు తెలుస్తోంది . ఈ నేపథ్యంలో ఆమె బీజేపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది . ఇంతకీ ఆ మహిళా ఎంపీ ఎవరని అనుకుంటున్నారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత . 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కవిత 1.5 లక్షల భారీ మెజార్టీతో తిరుగులేని విజయం సాధించించారు.

కవితను పార్టీలోకి తీసుకుని అయితే ప్రస్తుతం బీజేపిలో కూడా గిరిజన నేతలెవరూ పెద్దగా లేరు . ఈ నేపథ్యంలో ఎంపీ కవితను పార్టీలోకి తీసుకునే ప్రయత్నంలో కమలం నేతలు ఉన్నట్లు తెలుస్తోంది . ఇక్కడ ఆమెకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారట. ఒకవేళ కవిత బీజేపీలోకి వెళ్లి కేంద్ర మంత్రి పదవి దక్కించుకుంటే , ఒక గిరిజన మహిళగా మరో చరిత్ర సృష్టించనుంది . ఇలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్న ఎంపీగా కవిత చరిత్రలో నిలుస్తారు . ఈ నేపథ్యంలోనే కవిత కూడా కాస్త ఆలోచనలో పడిపోయినట్లు తెలుస్తోంది! వెళ్లాలా ? వద్దా ? అని తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో . . ?