ఉమ్మడి వరంగల్: మద్యం వ్యాపారిని నిలదీసిన యువకుడు..

మంగపేటలోని మద్యం దుకాణంలో అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారని వ్యాపారిని యువకుడు నిలదీశాడు. ఒక్కో క్వార్టర్ పై పది రూపాయల చొప్పున ఫుల్ బాటిల్ పై 40 రూపాయలు అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని, అలా వసూలు చేయాలని ప్రభుత్వం ఏమైనా జీఓ జారీ చేసిందా అని ప్రశ్నించగా నీళ్లు నమిలి దాటవేత సమాధానం చెప్పిన మద్యం వ్యాపారి. అధిక ధరలకు మద్యం అమ్ముతున్న మంగపేట మద్యం షాపును ఆబ్కారీ అధికారులు వెంటనే సీజ్ చేయాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు…