తెలంగాణలో కొత్తగా 1,554 మందికి కరోనా సోకింది. వీరికి నిర్వహించిన టెస్టుల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనాతో బుధవారం తొమ్మిది మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 49,259కి చేరుకుంది. కరోనా సోకి అన్ని జిల్లాల్లో మొత్తం 438 మంది చనిపోయారు. ఇప్పటివరకూ కోలుకుని 37,666 మంది డిశ్చార్జు అయ్యారు. తాజాగా 1,281 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,155 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు:

హైదరాబాద్ 842, రంగారెడ్డి 132, మేడ్చల్ 96, సంగారెడ్డి 24, ఖమ్మం 22, కామారెడ్డి 22,వరంగల్ అర్బన్ 38, వరంగల్ రూరల్ 36, నిర్మల్ 1, కరీంనగర్ 73, జగిత్యాల 3, యాదాద్రి భువనగిరి 8, మహబూబాబాద్ 11, పెద్దపల్లి 23, మెదక్ 25, మహబూబ్ నగర్ 14, మంచిర్యాల 3, భద్రాద్రి కొత్తగూడెం 1, నల్లగొండ 51, రాజన్న సిరిసిల్ల 18, ఆదిలాబాద్ 8, ఆసీఫాబాద్- 2, వికారాబాద్ 1, నాగర్ కర్నూల్ 14, నిజామాబాద్ 28, ములుగు 8, వనపర్తి 21, సిద్దిపేట 2, సూర్యాపేట 22, గద్వాలలో 5 కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.