టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత రెండో పెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చింది. ఇవాళ(సోమవారం) ఉదయం ఆమె ఎంగేజ్ మెంట్ అయ్యింది. డిజిటల్ మీడియా మ్యాంగో అధినేత రామ్ తో ఆమె నిశ్చితార్థం చేసుకున్నారు. అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్ మెంట్ అయ్యింది. గత కొన్ని రోజులుగా సునీత రెండో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి.

ఇవాళ ఆమె ఎంగేజ్ మెంట్ కు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వార్తలు నిజమయ్యాయి. అయితే పెళ్లి ఎప్పుడనేది ప్రకటించ లేదు. సునీతకు 19 ఏళ్ల వయసులోనే పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. తర్వాత భర్త తీరు నచ్చక విడాకులు తీసుకున్నారు. సునీత టాలీవుడ్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ గా మంచి ఫాలోయింగ్ ఉంది.