చాలామంది చల్లని వాతావరణంలో కొంత సమయం గడిపిన తర్వాత ఒక్కసారిగా వేడి ప్రదేశంలోకి వెళ్తే బలే గమ్మత్తుగా, కిక్కిచ్చే ఫీలింగ్‌ ఉంటుంది. అందువల్ల చల్లటి గాలి, వేడివేడి సూర్యకాంతిలో నిద్రిస్తూ మజా అనుభవిచేందుకు కొందరు బీచ్‌లలో ఎక్కువ సమయం గడుపుతుంటారు. అయితే మరి వేడి ఉష్ణోగ్రతలో అధిక సమయం నిద్రించడం మంచిదే అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఇలానే ఓ 25 ఏళ్ల అమ్మాయి వేడి వాతావరణంలో నిద్రించడం వల్ల తన ముఖం ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లుగా మారిపోంది. బ్యూటీషియన్ అయిన 25ఏళ్ల సిరిన్ మురాద్ బల్గేరియన్ బీచ్‌లో దాదాపు 30నిమిషాల పాటు నిద్రపోవడం వల్ల తన ముఖాన్ని తానే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. 21ºC ఉష్ణోగ్రత వద్ద సేదతీరుతున్న సిరిన్ ఎండ తీవ్రత ప్రారంభంలో తన ఫేస్ కొద్ది నొప్పిగా, ఎర్రగా ఉన్నట్లు భావించింది.

అయితే ఆ ప్రభావం మరుసటి రోజు తన ముఖంలో ముడతలుగా కనిపించడంతో సిరిన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. నుదిటిపై చర్మంతో పాటు కళ్ల చుట్టూ చిన్న చిన్న మచ్చలు కూడా ఏర్పడ్డాయి. ఇక ఈ విషయాన్ని డాక్టర్‌‌తో కాకుండా తన ఫ్యామిలీతో షేర్ చేసుకుంది సిరిన్. ఈ మేరకు ”మరుసటి రోజు ఇది నన్ను చాలా భాదించింది. కానీ, చర్మం ఊడిపోవడం ప్రారంభించినపుడు నాకు కొంత ఉపసమనం లభించింది. గతం కంటే నా ఫేస్ స్కిన్ ఇప్పుడు చాలా బాగుంది” అని ఆమె చెప్పింది. అయితే ఆమె ఫేస్ స్కిన్ నార్మల్ స్థితికి రావడానికి ఏడు వారాలు పట్టింది. అందువల్ల సన్‌స్క్రీన్‌ను యూజ్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే స్కిన్ అనేది ఎప్పుడూ సూర్యరశ్మి వల్ల గాయపడుతుంది. ఆ క్రీమ్‌లో ఉండే మాస్క్ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించడమే కాకుండా ముడతలు, అవాంఛిత పిగ్మెంటేషన్‌తో సహా చర్మం దెబ్బతినకుండా చేస్తుంది.