పొగత్రాగరాదు అంటూ ముకేష్ హారర్ యాడ్ లాగా రాహుల్ ద్రవిడ్ లాగా ‘రన్ అవుట్ కావొద్దని’ అందరికీ నీతులు చెప్తుందని కానీ తను మాత్రం పాటించదని నెటిజన్లు గట్టిగా తగులుకున్నారు. తనేమో మియామీలో హైఫై లైఫ్ ఎంజాయ్ చేస్తూ పక్కవారికి మాత్రం నీతులు చెప్తుందని తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయినా ఈ విమర్శకులు ఎన్ని చెప్పినా ట్రోలింగ్ జరిగినా ప్రియాంక మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన స్టైల్ లో తాను ఎంజాయ్ చేస్తోంది. పార్టీలలో మునిగి తేలుతూ సముద్రంలో ఈత కొడుతూ తన ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.

తనపై జరుగుతున్నప్రియాంక ట్రోలింగ్ పై ఇంతవరకూ స్పందించలేదు. ప్రియాంక స్మోక్ చేస్తే తప్పు లేనప్పుడు మిగతా వారిని స్మోక్ చేయకండి అని ఎందుకు చెప్పడం? బాణాసంచా కాల్చి కాలుష్యానికి కారణం అవ్వకండి.. దీపావళిని ఇలా సెలెబ్రేట్ చేసుకోకండి అని అందరికీ క్లాసులు పీకి తన పెళ్లికి మాత్రం వీలైనంత కాలుష్యాన్ని జనాలపైకి వదిలింది. ఇప్పుడేమో సభ్యసమాజానికి బికినీ సందేశం.. వైన్ సందేశం కూడా ఇస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఈ సెలబ్రేషన్స్ పూర్తవుతాయి.. అప్పుడు వచ్చి హోలీకి రంగులు పూసుకోవద్దని.. గణేష్ పండగను బొమ్మలు లేకుండా జరుపుకోవాలని ఏది తోస్తే అది చెప్తుంది. అందుకే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు ‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’. గ్లోబల్ సుందరికి మనందరం లోకువే.