{"subsource":"done_button","uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1608281993077","source":"other","origin":"gallery","source_sid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1608451068160"}

సినిమా ఆఫర్లు తగ్గుతుండడంతో డిజిటిల్ ప్లాట్ ఫార్మ్ పై దృష్టి మళ్లించింది. నిన్న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన “పావ కధైగల్”లో ద్విపాత్రాభినయం పోషించడంతో పాటు చిన్నపాటి రిస్క్ కూడా చేసింది. ఒంటిపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా కేవలం బ్రాతో దర్శనమిచ్చింది. బెడ్ పై పడుకొనే సన్నివేశంలో దాదాపు ముప్పాతిక శాతం బహిర్గత పరిచింది. ఇప్పటివరకు అరకొర ఎక్స్ పోజింగ్ చేస్తూ వచ్చిన అంజలి ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఇదే మొదటిసారి. అంతటితో ఆగలేదండోయ్, ఎపిసోడ్ రిక్వైర్మెంట్ మేరకు బాలీవుడ్ నటి కల్కితో ఒక స్ట్రాంగ్ లిప్ లాక్ కూడా ఇచ్చింది. ఇప్పటివరకు హీరోలకు కూడా లిప్ లాక్ ఇవ్వని అంజలి, ఇప్పుడు ఏకంగా తన సహనటికి అంత స్ట్రాంగ్ లిప్ లాక్ ఇవ్వడం అనేది చర్చనీయాంశం అవ్వడమే కాక, సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అయితే, పాపం అంజలి ఇంత కష్టపడి, ఇన్ని రిస్కులు చేసిన ఫలితం మాత్రం సూన్యం. ఆమె ఎపిసోడ్ ను డైరెక్ట్ చేసిన విగ్నేష్ శివన్ డీలింగ్ సరిగా లేకపోవడం, లెస్బియన్ అనే అంశాన్ని ఏదో జోక్ గా వాడుకోవడం అనేది మైనస్ గా మారింది. దాంతో సిరీస్ లో మిగతా ఎపిసోడ్స్ కి వచ్చిన రిసెప్షన్ లో సగం కూడా ఈ ఎపిసోడ్ కు రాకపోతుండడంతో బాధపడుతొంది అంజలి. నిజానికి ఈ సిరీస్ & ఆమె ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యి “లస్ట్ స్టోరీస్”లో కియారా అద్వానీ స్థాయికి వెళ్లిపోవాలనుకుంది అంజలి. ఆమె అంచనాలు, ఆశలన్నీ తలకిందులయ్యాయి.