బిగ్ బాస్ తెలుగు సీజన్-1 సమయంలోనే ఈ విషయాన్ని రివీల్ చేసిన అర్చన ఆ తర్వాత తన బోయ్ ఫ్రెండ్ ని అందరికీ పరిచయం చేసింది. అతడితో కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోల్ని Facebook ద్వారా రివీల్ చేసింది. త్వరలోనే శుభవార్త చెబుతాను అని ఊరించింది. అర్చన ఇచ్చిన హింట్ తో తన బోయ్ ఫ్రెండ్ ని పెళ్లాడబోతోందని అందరికీ అర్థమైంది.

ఎట్టకేలకు అర్చన నిశ్చితార్థం పూర్తయింది. బోయ్ ఫ్రెండ్ జగదీశ్ అంగుళీకం తొడుతున్న ఫోటోలు రివీలయ్యాయి. ఈ నిశ్చితార్థ వేడుకకు శివబాలాజీ సతీమణితో కలిసి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగిందని తాజాగా రివీలైన ఫోటోల్ని బట్టి అర్థమవుతోంది.

అల్లరి నరేష్ సరసన నేను అనే చిత్రంతో కథానాయికగా తెరకు పరిచయం అయిన అర్చన చక్కని క్లాసికల్ డ్యాన్సర్. యమదొంగ చిత్రంలో ఓ పాటలో మెరిసింది. యంగ్ టైగర్ హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పాల్గొంది. తెలుగు- తమిళం- కన్నడం- మలయాళం చిత్రాల్లో నటించింది. అందం అభినయం ఉన్నా , ఎందుకనో కథానాయికగా ఎదగలేకపోయింది…