రాజకీయం శత్రువులను పెంచితే, సినిమా స్నేహితుల్నీ, స్నేహాన్ని పెంచుతుందన్నారు చిరంజీవి సరిలేరు నీకెవ్వరు సినిమా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ:

‘‘సండే అననురా! మండే అననురా ఎన్నడూ నీదానరా..’ అంటూ పాట పాడిన విజయశాంతి నన్ను వదిలేసి 15ఏళ్లు దాటి పోయింది. ఇన్నేళ్లకు మళ్లీ కలవడం ఆనందంగా ఉంది. ‘నా కన్నా ముందే రాజకీయాల్లోకి వెళ్లావు కదా! నన్ను ఎలా తిట్టావు విజయశాంతి..’ (మధ్యలో విజయశాంతి అందుకుని, రాజకీయం వేరు, సినిమాలు వేరు నవ్వులు) 15ఏళ్లు అయినా, అదే సొగసు, అదే పొగరు, అదే అందం, మళ్లీ మనం కలిసి నటిస్తామేమో.

రాజకీయం శత్రువులను పెంచుతుంది. సినిమా స్నేహాన్ని పెంచుతుంది. తన మీద ఉన్న ప్రేమ, మమకారం వల్ల ఎప్పుడూ తనని ఒక్క మాట కూడా అనలేదు. (మధ్యలో విజయశాంతి అందుకుని.. మీ మీద ఎప్పటికీ గౌరవం ఉంది. ప్రజల కోసమే నా పోరాటం.) ఇన్నేళ్ల తర్వాత మహేశ్‌ సినిమా వల్ల మేము కలిసి మాట్లాడే అవకాశం లభించింది. ఈ సినిమాతో పాటు సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి అన్నారు.