ఈరోజు మెదక్ జిల్లా ఎస్.పి. మరియు సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు మాట్లాడుతూ: తేదీ 15.02.2020 నాడు మెదక్ జిల్లా వ్యాప్తంగా 244 డైరెక్టర్ స్థానాలకు (టి. ‌సి), అలాగే సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 407 డైరెక్టర్ స్థానాలకు(టి.సి.) జగబోయే ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికలకు పటిష్ట మైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినదని జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు తెలిపారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 పోలింగ్ కేంద్రాలలో 21 నార్మల్(సాధారణ) పోలింగ్ కేంద్రాలుగా, 11 క్రిటికల్ ( సమస్యాత్మక) పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. అలాగే సంగారెడ్డి 44 పోలింగ్ కేంద్రాలలో అన్నీ సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికల నేపద్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ బందోబస్తుతో పాటు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందుకోసం సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించడంతో పాటు, ఎన్నికల సమయంలో గోడవలను సృష్టించే వ్యక్తులను గుర్తించాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలని ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా ఎవరైనా పాల్పడితే వారిపట్ల కటినంగా వ్యవహరిస్తామని తెలిపారు, అలాగే ప్రణాళికతో కూడినటువండి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సాఫ్ట్ వేర్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు అధునాతనమైన ట్యాబ్ లో ఫోటోలు చిత్రీకరించి అధికారులు పోలీస్ సిబ్బంది కలిసి జియో ట్యాగింగ్ పూర్తి చేసినారని,

దీనివల్ల పోలింగ్ కేంద్రంలో ఏదైనా సంఘటన జరిగితే సత్వరమే పోలీస్ యంత్రాంగం అక్కడికి చేరుకొని తగు చర్యలు చేపడుతుందని, ఎన్నికల ప్రచార సమయం ముగిసినందున ఎవరైనా ఎన్నికల కోడ్ కి విరుద్దంగా ప్రచారం నిర్వహిస్తే వారిపైన ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపినారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకున్నదని ఎస్.పి. గారు తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు పోలీసు శాఖ అన్నివిధాలా ఏర్పాట్లు చేసిందని, స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్.పి. గారు తెలిపారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకోవడం లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎస్పి గారు పిలుపునిచ్చారు.

ఎన్నికల నియమావళి ఎవరైనా ఉల్లంఘిస్తే:

అలాగే ఎన్నికల నియమావళి ఎవరైనా ఉల్లంఘిస్తే, ఎవరైనా రాజకీయ పార్టీల వారు డబ్బు/ మద్యం పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లైతే వెంటనే క్రింది నెంబర్ లకు ఫోన్ చేసి సమాచారం నేరుగా మెదక్ జిల్లా పోలీసు వాట్సాప్ నెంబర్ 7330671900, లేదా మెదక్ డి.ఎస్.పి. 9490617007, తూప్రాన్ డి.ఎస్.పి. 9490617008, మెదక్ టౌన్ ఎస్.హెచ్.9490617045 , మెదక్ రూరల్ సి.ఐ. 9490617015 , రామాయంపేట్ సి.ఐ.- 9490617018 , తూప్రాన్ సి.ఐ. 9490617016, నర్సాపూర్ సి.ఐ. 9490617017, డయల్ 100, లేదా మెదక్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లైనటువంటి 08452223533, 08452221667, లకు ఫోన్‌ చేసి పిర్యాదు చేసినచో విచారణ జరిపి తప్పు చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యెస్.పిగారు తెలిపినారు.